కాగ్ స్టేట్ ఆడిట్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా వేణుగోపాలరావు
భారతీయ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆధ్వర్యంలోని రాష్ట్ర ఆడిట్ అడ్వైజరీ బోర్డు (ఎస్ఏఏబీ-సాబ్)కు 2026-28 కాలానికిగాను సీనియర్ జర్నలిస్టు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం వేణుగోపాలరావు మరోసారి విశిష్ట సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : భారతీయ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆధ్వర్యంలోని రాష్ట్ర ఆడిట్ అడ్వైజరీ బోర్డు (ఎస్ఏఏబీ-సాబ్)కు 2026-28 కాలానికిగాను సీనియర్ జర్నలిస్టు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం వేణుగోపాలరావు మరోసారి విశిష్ట సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఈ బోర్డులో రెండో టర్మ్‌కు కూడా కొనసాగుతున్న ఏకైక సభ్యుడు ఆయనే కావడం విశేషం. ప్రజా ఆర్థిక నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించడానికి కాగ్ రాష్ట్రంలోని అకౌంటెంట్స్ జనరల్ కార్యాలయాల ద్వారా విధులను నిర్వహిస్తున్నది.
ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, బడ్జెట్ నిబంధనలు, సంక్షేమ పథకాల పనితీరుపై నిష్పాక్షికంగా ఆధారపూర్వకమైన అంచనాలను రూపొందించడంలో కాగ్ నివేదికలు కీలకపాత్ర పోషిస్తాయి. తెలంగాణ స్టేట్ ఆడిట్ అడ్వైజరీ బోర్డు 2026-28 తొలి ప్రారంభ సమావేశం ఈ నెల 29న ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని సైఫాబాద్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయ మొదటి అంతస్తులోని ఎఫ్-బ్లాక్ సమావేశ మందిరంలో జరుగనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

