తెలంగాణ మా జాగీరే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై గద్దర్ కుమార్తె వెన్నెల ఫైర్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీర్.. ఈ రోజు మా జాగీర్.. రేపు మా బిడ్డల జాగీర్' అని స్పష్టంచేశారు.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీర్.. ఈ రోజు మా జాగీర్.. రేపు మా బిడ్డల జాగీర్’ అని స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్ కల్యాణ్‌ను తాము అభిమానిస్తామని వెన్నెల తెలిపారు.
అలా అని తెలంగాణ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బిడ్డగా తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఎవరినీ బాధపెట్టకుండా, హింసించకుండా తనను తాను ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారినే తెలంగాణ ఆవిర్భావానికి సాక్ష్యమని పేర్కొన్నారు. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

