హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రచార కార్యదర్శిగా రాచమళ్ల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. వెంకటేశ్వర్లకు మంగళవారం మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామకపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఆర్యవైశ్యులు అన్ని రంగాలతోపాటు రాజకీయంగా ఎదగడానికి మహాసభ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. తనకు బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.