హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం మూతపడింది. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభంకానున్నది. ఈ క్రమంలో ఉదయం స్వామివారి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఆలయ ద్వారాలను మూసివేశారు.
అలాగే అనుబంధ ఆలయాల్లోనూ పూజల అనంతరం ద్వారాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయ ఆవరణలో జ్వాలాతోరణం నిర్వహించడంతో పాటు స్వామివారి మహాపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.