హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (టీజీ-ఆర్ఈఏటీ) టెక్నికల్/అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వేముల శ్రీకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
1995 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీకర్ సుమారు 26 ఏండ్ల పాటు ఆదాయ పన్నుశాఖలో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. ముంబైలో ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఆయన 2021లో ఉద్యోగ విరమణ పొందారు.