విమర్శించినోళ్లే ఎత్తిపోస్తున్నరు.. వేముల ప్రశాంత్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ నిరంతరం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రాంపూర్ పంప్‌హౌస్ మోటర్లను ప్రారంభించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
- రాంపూర్ పంప్‌హౌస్ కాళేశ్వరంలోనిదే
- ఎత్తిపోతల ప్రారంభం హర్షణీయం
- లక్షకోట్లు వృథా అనేది దుష్ప్రచారమే
మోర్తాడ్, ఆగస్టు 1: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ నిరంతరం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రాంపూర్ పంప్‌హౌస్ మోటర్లను ప్రారంభించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎత్తిపోతలతో కాంగ్రె స్ సర్కార్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలిపోయిందని పేర్కొన్నారు. కూలి పోయిందని, ఉపయోగంలేదని, లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయని కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాంపూర్ పంప్‌హౌస్ మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను ఎస్సారెస్పీ వరద కాలువలోకి ఎత్తిపోస్తున్నారని, ఈ పంప్‌హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలని సూచించారు.
వరద కాలువపై ఉన్న రాజేశ్వర్‌రావుపేట్ పంప్‌హౌస్‌ను కూడా వెంటనే ప్రారంభించి ఎస్సారెస్పీ వరకు మొత్తం వరద కాలువను పూర్తినీటితో నింపాలని, వరద కాలువ ద్వారా చెరువులు కూడా నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్‌ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్సారెస్పీపై ఉన్న లక్ష్మి లిఫ్ట్, వేంపల్లి లిఫ్ట్, బోదెపల్లి లిఫ్ట్, చౌట్పల్లి హనుమంత్‌రెడ్డి, గుత్ప-అలీసాగర్ లిఫ్ట్‌లను వెంటనే ప్రారంభించి నిజామాబాద్ జిల్లాలోని చెరువులను నింపి రైతాంగానికి నిరంతరం సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

