శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 02, 2020 , 15:37:05

చిలువేరు సౌజన్యంతో 800 కుటుంబాలకు కూరగాయలు అందజేత

చిలువేరు సౌజన్యంతో 800 కుటుంబాలకు కూరగాయలు అందజేత

యాదాద్రి భువనగిరి : కరోనా కష్టకాలంలో దాతలు తమ తోచినంతలో తోటివారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు, అలేనగర్‌ గ్రామాల్లో దాతలు కురగాయలను అందజేశారు. చిలువేరు లక్ష్మణ్‌, మిరియాల ఫణిరాజ్‌, చిలువేరు అలేఖ్యల సౌజన్యంతో సుమారు 8 వందల కుటుంబాలకు భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్‌రెడ్డి కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, జూలూరు సింగిల్‌విండో చైర్మన్‌ అందెల లింగం యాదవ్‌, జూలూరు గ్రామ సర్పంచ్‌ యాకరి రేణుక నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo