వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 18: వ్యవసాయ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ వారు చేపట్టిన నిరనస గురువారం పదో రోజుకు చేరుకుంది. వర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించి భూములను కాపాడాలని నినాదాలు చేశారు.
రాజేంద్రనగర్‌తోపాటు పాలెం, వరంగల్, సిరిసిల్ల, అశ్వారావుపేట, జగిత్యాల, ఆదిలాబాద్, సం గారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల యూజీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు నిరసనలకు దిగారు. యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం వల్ల భవిష్యత్తు తరాలకు అపారనష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ నిరసనలకు ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకుని వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ జారీచేసిన జీవో 55ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో విద్యార్థి సం ఘా ల నాయకులు రాజ్‌కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, శంకర్‌నాయక్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.