Vocational courses | ఉపాధి.. ఉద్యోగం.. ఉన్నత విద్యావకాశం.. బీసీ గురుకులాల్లో విభిన్న వృత్తివిద్యా కోర్సులు
బీసీ గురుకుల విద్యాలయాలు విభిన్న వృత్తివిద్యా కోర్సులకూ నిలయాలుగా మారనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో రెగ్యులర్ కోర్సులతో పాటు పలు ఒకేషనల్ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
- వచ్చే ఏడాది నుంచి అమలు
- జీవితంలో స్థిరపడేలా అవకాశం
Vocational courses | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల విద్యాలయాలు విభిన్న వృత్తివిద్యా కోర్సులకూ నిలయాలుగా మారనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో రెగ్యులర్ కోర్సులతో పాటు పలు ఒకేషనల్ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సంప్రదాయ కోర్సులతోపాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. విద్యార్థుల అభిరుచులకు, ఆసక్తికి అనుగుణంగా, ఉపాధి అవకాశాలకు ఈ కోర్సులు దోహదపడతాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అత్యధిక డిమాండ్ ఉండే ఈ కోర్సులను బీసీ జూనియల్ గురుకుల కాలేజీల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది.
ఐటీ, సాంకేతిక విద్యకు పెద్దపీట
కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కోర్సుతో యానిమేటర్లు, గ్రాఫిక్, వెహికల్, ప్రొడక్ట్, ఇంటీరియర్ డిజైనర్లుగా, ఆర్ట్ డైరెక్టర్లు, ప్రోగ్రామ్ 3డీ మోడలింగ్, గేమ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ ఉద్యోగాలను పొందే అవకాశమున్నది. అడ్వైర్టెజ్‌మెంట్, చలనచిత్రం, టెలివిజన్, వీడియోగేమ్ డెవలప్మెంట్, వెబ్సైట్ డిజైన్‌తో సహా అనేక రకాల పరిశ్రమల్లో నిపుణులకు ఎకువగా అవకాశాలు ఉన్నాయి.
గార్మెంట్ టెక్నాలజీతో ఉపాధి మెండు
కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసిన తర్వాత సొంతంగా బొటిక్, టైలరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉన్నత విద్య కోర్సులైన బీఎఫ్టీ (బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ), బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో చేరే వెసులుబాటు ఉంది.
వైద్యరంగంలో అవకాశాలు పుష్కలం
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టిపర్పస్ హెల్త్ వరర్, ఫిజియోథెరపీ తదితర కోర్సులు పూర్తయితే ఉన్నత విద్య కోర్సుల్లో చేరవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏఎన్ఎంలుగా, టెక్నియన్లుగా పుష్కలమైన అవకాశాలున్నాయి. బీఎస్సీ, ఇతర జనరల్ కోర్సులు కూడా చేయొచ్చు. టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ తదితర కోర్సులూ ఉపాధి, ఉన్నత విద్య అవకాశాలకు ఆస్కారమున్నది.
మార్కెట్లో ఈ కోర్సులకు యమ డిమాండ్
గురుకులాల్లో ప్రవేశపెట్టిన నూతన వృత్తివిద్యా కోర్సులకు మంచి డిమాండ్ ఉన్నది. ప్రీసూల్ టీచర్ ట్రైనింగ్ (పీఎస్టీటీ), కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ (సీజీఏ), అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్ (ఏసీపీ), కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ (సీజీటీ), మల్టిపర్పస్ హెల్త్ వరర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ), ఫిజియోథెరపీ (పీటీ), టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (టీహెచ్)తో పాటు అనేక నూతన కోర్సులు ఉన్నాయి. వ్యవసాయం, ఆతిథ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు సంబంధించిన కోర్సులే అత్యధికంగా ఉండడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

