జమ్మికుంట రూరల్, జనవరి 22 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు, ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హన్మకొండ ఖాదీ వస్త్రగార్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ ట్రస్ట్‌బోర్డు చైర్‌పర్సన్‌ను ఎన్నుకున్నారు. ఖాదీ ట్రస్ట్ బోర్డు వైస్ చైర్మన్ కే రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీని చైర్‌పర్సన్‌గా ప్రతిపాదించగా, కార్యదర్శి వీ కిషన్‌రావు, సభ్యుడు పీ గోపాల్‌రావు బలపర్చడంతో సభ్యులు ఆమోదించారు. దీంతో వాణీదేవి చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వావిలాల ఖాదీ సూపరింటెండెంట్ నాగమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.