వనమా రాఘవ అరెస్టు

- ఏపీ సరిహద్దు చింతలపూడిలో అదుపులోకి
- రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2
- టీఆర్ఎస్ నుంచి రాఘవ సస్పెన్షన్
హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం క్రైం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న వనమా రాఘవను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకొన్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం వైపు పారిపోతుండగా ఏపీ సరిహద్దులోని దమ్మపేట మండలం మందలపల్లి వద్ద అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మాహుతి ఘటనలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు 302, 306, 307 కింద కేసులు నమోదు చేశారు. మూడు రోజులుగా పరారీలో ఉన్న రాఘవను పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలించి పట్టుకొన్నారు. వనమా రాఘవేంద్రపై వచ్చిన ఆరోపణలను టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకొన్నది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచన మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మం ఇంచార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు వనమా రాఘవను శుక్రవారం ఉదయమే పార్టీ నుంచి సస్పెండ్‌చేశారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని టీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు వనమా రాఘవను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం అఖిలపక్షాలు చేపట్టిన కొత్తగూడెం నియోజకవర్గ బంద్ ప్రశాంతంగా ముగిసింది. వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

