సిద్దిపేట మార్చి 17 : వచ్చే నాలుగు నెలల్లో వైశ్య సదనాన్ని అందుబాటులోకి తీసుకరావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో జీ+1 విధానంలో నిర్మిస్తున్న వైశ్య సదనం పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఇప్పటికే రూ.2.6కోట్లు కేటాయించగా ఆ నిధులు సరిపోకపోవడంతో రూ.2కోట్లు నిధులు మంత్రి హరీశ్‌రావు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సదనం ప్రదాన పనులు పూర్తికాగా పెండింగ్ పనులైన ఆర్చ్, గేట్, ప్రహరీ, పాల్ సీలింగ్ పనులు పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకరావాలని అధికారులను అదేశించారు. ఇంకా అవసరం అయితే మరిన్ని నిధులు మంజూరు చేస్తానని మంత్రి పేర్కొన్నారు. అలాగే రెండు నెలల్లో గౌడ కమ్యునిటీ భవన నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పనులు ఆలస్యంగా జరుగడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల, ఎఎంసీ చైర్మన్ పాల సాయిరాం, కౌన్సిలర్లు వినోద్‌గౌడ్, నాయకం లక్ష్మణ్, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు బాలకిషన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.