Vaddiraju Ravichandra | వెలుగు పత్రిక కథనంపై వద్దిరాజు రవిచంద్ర తీవ్ర అభ్యంతరం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
Vaddiraju Ravichandra | కొండపోచమ్మ సాగర్ నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రానికి నీటిని తరలించుకుపోతున్నారంటూ వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు
Vaddiraju Ravichandra | కొండపోచమ్మ సాగర్ నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రానికి నీటిని తరలించుకుపోతున్నారంటూ వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఈ కథనం నిరాధారమైనదని పేర్కొంటూ ఆయన తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా నిందారోపణలతో కూడిన కథనాన్ని ప్రచురించడంపై ఎంపీ రవిచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఛానల్, పత్రికలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వాస్తవాలతో సంబంధం లేని కథనాలను ప్రచురించడం సరికాదని పేర్కొన్నారు.
24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలి
వెలుగు దినపత్రికలో అక్టోబర్ 17న ప్రచురించిన కథనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. క్షమాపణలకు సంబంధించిన వార్తను 24 గంటల్లో తగిన ప్రాధాన్యంతో ప్రచురించాలని స్పష్టం చేశారు. తన డిమాండ్లను పాటించని పక్షంలో పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు. కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడాన్ని సహించబోమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

