అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి

ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్టు చైర్మన్ గంజి రాజమౌళిగుప్తా
రవీంద్రభారతి, ఏప్రిల్ 4: తెలంగాణలోని అగ్రవర్ణ కులాల పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్టు చైర్మన్ గంజి రాజమౌళిగుప్తా అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. అగ్రవర్ణ పేదల సంక్షేమానికి 10 శాతం రిజర్వేషన్లను చట్టంగాచేసి దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనం కలిగించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవో జారీచేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుస్స శ్రీనివాస్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ప్రధాన కార్యదర్శి పండగంటి రమేశ్, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు గోపు జైపాల్‌రెడ్డి, రామారావు, గంజి స్వరాజ్యబాబు, తాడిశెట్టి పశుపతి, దుబ్బ శ్రీనివాస్, రమణయ్య, ఉపేందర్, శారద తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

