తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 23: 00000మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మహాకవి వానమామలై వరదాచార్యుల పురస్కారాన్ని శ్రీధర్‌కు అందజేశారు. శ్రీధర్ మాట్లాడుతూ.. తెలుగు భాష కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తిం పు పద్యంతోనే వచ్చిందని అన్నారు.
తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే పద్యంపై పట్టు సాధించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో పరిషత్తు కార్యదర్శి జే చెన్నయ్య, కవి తిరుమల శ్రీనివాసాచార్య, పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, సాహితీవేత్తలు ఎం సుజాతారెడ్డి, సీ వసుంధర, నాగమణి పాల్గొన్నారు.