జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.
- ఇండ్లస్థలాలు వెంటనే కేటాయించాలి
- ఆరోగ్య బీమా అమలు చేయాలి
- రాష్ట్ర టీయూడబ్ల్యూజే వినతి
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ): జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం బీహెచ్ఈఎల్లో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదురొంటున్న ప్రధాన సమస్యలు, పరిషార మార్గాలపై పలు తీర్మానాలను ఆమోదించింది.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను సత్వరమే కేటాయించాలని, హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో ఉన్న పెండింగ్ ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరింది. గడిచిన పదేండ్లలో అనారోగ్యాలతో, వివిధ ప్రమాదాల్లో దాదాపు 500 మంది జర్నలిస్టులు అకాలమరణం పొందారని సమావేశం విచారణ వ్యక్తం చేసింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌కార్డుల సమస్యను కూడా పరిషరించాలని కోరింది. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకూ ఆరోగ్య పథకాన్ని అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించినప్పటికీ జర్నలిస్టుల పట్ల జాప్యంచేయడం సరికాదని సమావేశం అభిప్రాయపడింది.
అనారోగ్యాలకు గురవుతున్న జర్నలిస్టులు భరించలేనంత అప్పులు చేసి ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. జర్నలిస్టుల కుటుంబాలను ఆపద సమయంలో ఆదుకోవడానికి మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇస్తున్న నెలసరి పెన్షన్ మొత్తాన్ని కనీసం రూ.10 వేలకు పెంచాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. అలాగే ఏక మొత్తంలో చెల్లించే లక్ష రూపాయలను రెండు లక్షల రూపాయలకు పెంచాలని తెలంగాణ మీడియా అకాడమీని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

