Kishan Reddy | అంకెల గారడీ తప్ప బడ్జెట్లో ఏమి లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy | రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అభూత కల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్లో ఏం లేదని ఎద్దేవా చేశారు.
Kishan Reddy | రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అభూత కల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్లో ఏం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని అన్నారు. ప్రతి ఏడాది రైతులకు సీజన్ ముందు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయానికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని అన్నారు.
బడ్జెట్ మొత్తంలో ఆసరా పెన్షన్ల ప్రస్తావనే లేదని కిషన్ రెడ్డి అన్నారు. పింఛన్లు పెంచుతామని మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. కానీ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. దళిత సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ.21,072 కోట్ల నుంచి రూ.7,638 కోట్లు తగ్గిపోయిందని, గిరిజన సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ. 4,365 కోట్ల నుంచిరూ. 3,969 కోట్లకు తగ్గిపోయిందని తెలిపారు. మొత్తం ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదు.. కానీ మైనారిటీల సంతుష్టీకరణ మాత్రమే మాకు కావాలనే కాంగ్రెస్ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్లో బట్టబయలైందని అన్నారు. 2023-24లో రూ.2వేల కోట్లుగా ఉన్న మైనార్టీ సంక్షేమ నిధులను.. ఈ బడ్జెట్లో ఏకంగా రూ.3,003 కోట్లకు పెంచారు. అంటే ఒక్క ఏడాదిలోనే 30% కోటా బడ్జెట్ పెంచేశారని తెలిపారు.
మహిళలకు డ్వాక్రా రుణాలు ఇస్తామని గొప్పగా ప్రస్తావించారని.. కానీ అది ఇప్పటికే ఉన్నదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు అన్నారని.. దాని ఊసే లేదని మండిపడ్డారు. విద్యా నిధి పథకం కింద రూ.5 లక్షల సాయం చేస్తామన్నారని.. దాని ప్రస్తావన కూడా లేదన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.. అదీ లేదని పేర్కొన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలేమిటో.. నిధులు ఎలా సమకూర్చుకుంటారో ప్రభుత్వం బడ్జెట్లో చూపించలేదని కిషన్ రెడ్డి అన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

