Allu Arjun | ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందని ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా శుక్రవారం వ్యాఖ్యానించారు. కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని గుర్తు చేశారు.
కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందని అన్నారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంలో పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
The arrest of Shri Allu Arjun is irresponsible & unwarranted. The intent behind this arrest seems motivated as the organizers of the show claim to have informed the concerned authorities in advance. Moreover the onus and responsibility of law & order lies with the police…
— G Kishan Reddy (@kishanreddybjp) December 13, 2024