హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణకు సోమవారం హాజరుకాలేనని, మరో రోజు హాజరవుతానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ నెల 28 సిట్ విచారణకు హాజరుకానున్నట్టు ఇటీవల ఆయన పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున సోమవారం నాటి విచారణకు హాజరుకాలేకపోతున్నానని, త్వరలో హాజరయ్యే తేదీని వెల్లడిస్తానని ఆదివారం సిట్‌కు, మీడియాకు ఆయన సమాచారం ఇచ్చారు.