Auto Drivers | హైదరాబాద్ సిటీబ్యూరో, కవాడిగూడ, మే 27(నమస్తే తెలంగాణ): ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకుంటే ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లమంతా ఆమరణ దీక్షలకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 25న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రారంభమైన ఆటో రథయాత్ర మంగళవారం నాటితో ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపారు వద్ద ‘ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు’ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ మాట్లాడారు.
ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలు నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో 83 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని డిమాం డ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల జీవన భృతి కల్పిస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. వెయ్యి కోట్లతో ఆటో కార్మికుల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఆటో డ్రైవర్ల సమస్యల పరిషారనికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణం నెరవేర్చకుంటే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య, బీఎంఎస్ ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ హబీబ్, టీయూసీఐ నాయకులు ఉయ్యాల ప్రవీణ్, సాయి లు, ఆటో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆటో జేఏసీ డిమాండ్లు ఇవే