వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కోట్పల్లి నూతన సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్య స్వామి పై అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. కుటుంబ సభ్యులను సంగయ్యను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించారు. కాగా, సంగయ్య స్వామి పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని కోట్పల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.