Adilabad | అడవుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లా సహజ అందాలకు నెలవు. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన గుట్టలు, ఉప్పొంగే జలపాతాలతో వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని పొలాలు, అమాయక గిరిజనులు వెరసి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కశ్మీర్‌ను తలపిస్తోంది. ఇక జిల్లాలోని ఖండాల ప్రాంత అందాల వీక్షణ మరో అద్భుతం. ఆ ప్రాంతం ప్రకృతి అందాలకు చక్కని వేదికగా నిలుస్తోంది. ఖండాల ప్రకృతి అందాలు అటుగా వెళ్లే ప్రయాణికులను కనువిందు చేస్తున్నాయి. చూపు తిప్పుకోలేని ఈ ప్రకృతి అందాల వద్ద సెల్ఫీలు దిగుతూ.. వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు. సెలవు రోజుల్లో కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేందుకు ఖండాల ప్రాంతం చక్కటి ఎంపికగా చెప్పొచ్చు. ఆ ప్రకృతి అందాల పై మీరూ ఓ లుక్కేయండి.