హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జే రాజేశ్వర్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
డీట్లో ఇప్పటివరకు 75 వేల మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నట్టు వెల్లడించారు. 972కుపైగా కంపెనీలు ఇందులో నమోదు అయినట్టు తెలిపారు. ఐటీ, ఫార్మా, ఇండస్ట్రియల్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ మొదలైన రంగాల్లో 10080 ఉద్యోగ ఖాళీలను ప్రకటించాయని స్పష్టంచేశారు. డీట్ ద్వారా 51మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించినట్టు తెలిపారు.