హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : జీవో-317లో భాగంగా భాషాపండితుల స్పౌజ్ బదిలీలు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు- తెలంగాణ రాష్ట్రం(ఆర్‌యూపీపీ టీఎస్) ప్రభుత్వాన్ని కోరింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఫిజికల్ డైరెక్టర్ల బదిలీలను చేపట్టాలని కోరుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నియమించిన త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్‌మిట్టల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
అప్‌గ్రేడేషన్‌కు నోచుకోని 800 మంది భాషాపండితులను అప్‌గ్రేడ్ చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీ జగదీశ్, ప్రధాన కార్యదర్శి ములుకనూరి శంకర్ కోరారు.