హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల 20న యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా (యూహెచ్‌సీ) కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని సికింద్రాబాద్‌లోని -1 ఈఎంఈ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు భారత రక్షణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాల కోసం awwaleagle@ gmail.comకు మెయిల్ చేయాలని, ww w.joinindianarmy@nic.in పోర్టల్‌ను సందర్శించాలని, 040-27863016కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది.