చింతలమానేపల్లి : కుమ్రంభీం(Kumrambhim) ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ బావి(The well)లో పడి ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి(Youths died) చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..చింతలమానేపల్లి (Chinthalamanepalli) గ్రామానికి చెందిన కంబాల మహేష్ , సోదరుని పెండ్లి ఆదివారం జరిగింది. అదే రోజు రాత్రి 8గంటల సమయంలో కర్జెల్లీ గ్రామానికి చెందిన తన స్నేహితుడు తుమ్మిడే హరీశ్ ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు.
ఇద్దరు రాత్రి ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఆందోళన చెంది యువకులకు ఫోన్లు చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో బంధువుల ఇండ్లలో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం హరీశ్ బైక్ చింతలమానేపల్లి ఊరికి సమీపంలో టవర్ దగ్గర ఉన్న పంట చేను వద్ద కనిపించింది. పక్కనే ఉన్న మరో పత్తి చేనులో వెతకగా వ్యవసాయ బావిలో ఇద్దరి చెప్పులు పడి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతదేహాలను వెలికితీస్తున్న పోలీసులు
వెంటనే సీఐ సాదిక్ పాషా, ఎస్ఐ సురేష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో బావిలో గాలించగా ఇద్దరి మృత దేహాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై యువకుల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.. ఇద్దరి యువకుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు రోధించిన తీరు అందరినీ కలిచి వేసింది.