యాదాద్రి, ఏప్రిల్ 6 : భక్తులు యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు వీలుగా దేవస్థానం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘యాదాద్రి దర్శిని’ పేరిట రెండు నిమిషాలకో బస్సు నడుపుతున్నట్టు ఈవో గీత తెలిపారు. కొండ కింద ఆర్టీసీ బస్టాండ్, టికెట్ల కౌంటర్, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి పార్కింగ్ తదితర ప్రదేశాల నుంచి ఉచితంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్టు ఆమె వెల్లడించారు.