Karimnagar | ఆధ్యాత్మిక చింతనతో మురిసిన కరీంనగరం.. టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ
ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం (Karimnagar) మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
కరీంనగర్: ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం (Karimnagar) మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. తెల్లవారుజామునుంచే ఆలయం నిర్మించే స్థలంలో వేదపండితులు ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో భూకర్షణ హోమం, కలశారాధన, అష్టదిక్పాలకుల పూజ, మండప పూజ, కన్యకాపూజ, గోపూజ, ముత్తైదువ పూజ నిర్వహించారు. అనంతరం శ్రీవారి గర్బాలయం నిర్మించే స్థలంలో నాగలితో దున్ని నవధాన్యాలు వెదజల్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) కుటుంబ సమేతంగా హాజరు కాగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod kumar), జిల్లా కలెక్టర్ ఆర్వీ. కర్ణణ్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ. రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు తదితరులు హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
మంత్రి గంగుల కమలాకర్, బోయినిపల్లి వినోద్ కుమార్ నాగలిపట్టుకుని దున్నారు. అనంతరం మహా పూర్ణాహుతి, విశేష ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు. కరీంనగర్ వాసులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేందుకే పట్టణంలో టీటీడి క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని మంత్రి గంగుల అన్నారు. ఈ నెల 31న ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

