హైదరాబాద్, జూలై 20 (నమస్తేతెలంగాణ): తిరుమలలో ఆఫ్లైన్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనం కోసం టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు ఇకపై కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ‘పేలింక్’ ఎస్ఎంఎస్ ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చని వెల్లడించింది.