TSRTC | మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ బిగ్‌షాక్.. బస్సుల్లో కోళ్లు, గొర్రెలకు ప్రవేశం లేదు
TSRTC | మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు ఎంట్రీ లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని సజ్జనార్ కోరారు.
TSRTC | హైదరాబాద్ : మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు ఎంట్రీ లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని సజ్జనార్ కోరారు. మేడారం జాతర నేపథ్యంలో సజ్జనార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మేడారం జాతర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6వేలకు పైగా బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మేడారంలో 15 కిలోమీటర్ల మేర 48 క్యూ లైన్లు ఏర్పాట చేసినట్లు చెప్పారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని ఎండీ సజ్జనార్ సూచించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు కోళ్లు,గొర్రెలు, మేకలను అమ్మవార్లకు మొక్కులుగా సమర్పిస్తున్న విషయం విదితమే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

