గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 06:24:03

నేడు ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లోకి సమ్మెకాల వేతనం

నేడు  ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లోకి సమ్మెకాల వేతనం

హైదరాబాద్‌ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ టీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సమ్మెకాలానికి సంబంధించిన 55 రోజుల జీతభత్యాలను ఈ రోజు కార్మికుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం ఆర్థికశాఖ రూ. 235 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.   గత ఏడాది అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 28 మధ్యకాలంలో జరిగిన సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవు (స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌)గా పరిగణిస్తున్నట్లు ఆర్టీసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సమ్మెకాలంలో మరణించినవారికి, ఉద్యోగవిరమణ చేసినవారికి కూడా తుది వేతన లెక్కింపులో ఈ 55 రోజుల వేతనం కలుస్తుందని ప్రకటనలో తెలిపింది. 


logo