TSRTC | రాఖీ పౌర్ణమి లక్కీ డీప్ విజేతలకు టీఎస్ ఆర్టీసీ నగదు పురస్కారాలు..
TSRTC | లక్కీడ్రా విజేతలకు ఆర్టీసీ నగదు పురస్కారాలను అందజేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం లక్కీ డ్రాను ప్రకటించింది. ఇందులో గెలుపొందిన వారికి నగదు పారితోషకంతో పాటు సత్కరించాలని నిర్ణయించింది.
TSRTC | లక్కీడ్రా విజేతలకు ఆర్టీసీ నగదు పురస్కారాలను అందజేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం లక్కీ డ్రాను ప్రకటించింది. ఇందులో గెలుపొందిన వారికి నగదు పారితోషకంతో పాటు సత్కరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రాను నిర్వహించి, ప్రతి రీజియన్‌కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను అధికారులు ఎంపిక చేశారు.
హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మహిళలకు నగదు పురస్కారాలను, అందజేసి సత్కరించారు. ఒక్కో రీజియన్‌లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10వేల చొప్పున మొత్తం రూ.5.50లక్షల నగదు పురస్కారాలను అందజేశారు. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆగస్టు ౩౦, 31 తేదిల్లో సంస్థ లక్కీ డ్రా నిర్వహించగా.. మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్‌ను సేకరించారు.
ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఎండీ సజ్జనార్ నగదు పారితోషకాన్ని అందజేశారు. అయితే, కార్యక్రమానికి రీజియన్ల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా లక్కీడ్రా విజేతలు ఆర్టీసీతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ దైనందిత జీవితంలో ఆర్టీసీ బస్సు ఓ భాగమైందని, ప్రతి రోజు లక్షలాది మందిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

