TSPSC | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ ‘కీ’ని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. తుది కీ వివరాలను https://www.tspsc.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపింది. రాష్ట్రంలో 78 అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిరుడు ఆగస్టు 8న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) పద్ధతిన పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర భూగర్భ జలశాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల తుది ‘కీ’ని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఈ తుది కీని https: //www. tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని కమిషన్ తెలిపింది. నిరుడు జూలై 18, 19, 20, 31 తేదీల్లో సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.