నాంపల్లి కోర్టులు, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో 93వ నిందితుడు లడావత్ నరేశ్‌ను మూడు రోజుల సిట్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సిట్ అధికారులు శుక్రవారం నిందితుడిని చంచల్‌గూడ జైలు నుంచి కార్యాలయానికి తరలిస్తారు. సిట్ ఐదు రోజుల కోసం పిటిషన్ దాఖలు చేసిన దరిమిలా మూడు రోజుల తర్వాత సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చాలని మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఉత్తర్వులో పేర్కొన్నా రు. పలువురి నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పును శుక్రవారానికి వాయిదా పడింది.