హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 దరఖాస్తులను ఈ నెల 23కు బదులు 30 నుంచి స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియ వారం రోజులు ఆలస్యం కానున్నట్టు అనితా రామచంద్రన్ చెప్పారు. జనవరి 19 సాయంత్రం 5 గంటల వరకు https://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.