హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : మహిళా శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్వైజర్) ఫలితాలు విడుదలయ్యాయి. 181 పోస్టుల భర్తీకి జనవరి 6,7న రాత పరీక్ష నిర్వహించగా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. 26,751 మంది దరఖాస్తు చేస్తే 10,459 మంది పరీక్ష రాశారు. అభ్యర్థుల జీఆర్ఎల్తోపాటు, ఫైనల్ కీ, రెస్పాన్స్షీట్లను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : దేశంలోని ఐఐటీలు సహా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 1,2,15,16న పరీక్షలు నిర్వహించగా, 30 సబ్జెక్టుల ఫలితాలను ఐఐటీ రూర్కీ అధికారులు విడుదలచేశారు. 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 80శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు సమాచారం. ఈనెల 28 నుంచి మే 31 వరకు గేట్ స్కోర్‌కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ రూర్కీ వర్గాలు తెలిపాయి.