హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ మహేశ్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నకిలీ వైద్యులను ఏరివేస్తామని చెప్పారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని తెలిపారు. వైద్యుల సమస్యలన్నింటిపై ఓ నివేదిక తయారు చేసి, వాటి పరిషారానికి చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.
డాక్టర్లపై దాడులు జరగకుండా కఠిన చట్టాల అమలుకు కృషి చేస్తామని చెప్పారు. మెడికల్ కౌన్సిల్‌కు నూతన బిల్డింగ్‌ను తీసుకొచ్చి, వైద్యులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్తసంసరణల ద్వారా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇందుకు మెడికల్ కౌన్సిల్లో ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ మెంబర్లంతా సమన్వయంతో పనిచేస్తామని వివరించారు.