TS PECET | హైదరాబాద్ : బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) దరఖాస్తుల గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం పీఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇక గడువును పొడిగించే అవకాశాల్లేవని ఆయన తెలిపారు. ఇదే చివరి అవకాశం అని కన్వీనర్ స్పష్టం చేశారు.