TS LAWCET | హైదరాబాద్ : టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం ఈ వెబ్సైట్ లింక్‌ను https://lawcet.tsche.ac.in క్లిక్ చేయొచ్చు.
ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10.30 వరకు మొదటి సెషన్ జరిగింది. ఇక మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.