హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ): మూడు, ఐదేండ్ల లా కోర్సులతోపాటు ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ శనివారం విడుదల కానున్నది. 2022-23 విద్యా సంవత్సరం లా సెట్ షెడ్యూల్‌ను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్‌రావు, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి విడుదల చేశారు. పూర్తివివరాలకు https://lawcet.tsche.ac in వెట్‌సైట్‌ను సంప్రదించాలని ఓయూ అధికారులు సూచించారు.