LAW CET | టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష గురువారం నిర్వహించనున్నారు. పరీక్ష మూడు సెషన్లలో ఉంటుంది. మూడేండ్ల లా కోర్సు పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. ఐదేండ్ల లా కోర్సు, పీజీలాసెట్ ప్రవేశ పరీక్ష సాయంత్రం 4గంటల నుంచి 5: 30 గంటల వరకు నిర్వహిస్తారు. తెలంగాణలో 60, ఏపీలో 4 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ తెలిపారు. పరీక్షకు మొత్తం 43,692 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు.