హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేసే గడువును అధికారులు పొడిగించారు. రిపోర్టింగ్ గడువు శనివారంతో ముగియగా, తాజాగా ఆదివారం వరకు రిపోర్ట్ చేసే అవకాశాన్ని కల్పించారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంసెట్ అధికారులు సూచించారు.