టీఆర్ఎస్ సౌతాఫ్రికా (TRS South Africa) శాఖ ఏర్పడి మూడేళ్లయిన సందర్భంగా టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. గడిచిన మూడేళ్లుగా టీఆర్ఎస్ సౌతాఫ్రికా చేసిన సేవలను ఆమె కొనియాడారు. కరోనా సమయంలో సౌతాఫ్రికాతోపాటు మిగతా ఆఫ్రికా దేశాల్లో పార్టీ విభాగం చేసిన సేవను కవిత మెచ్చుకున్నారు. సౌతాఫ్రికాలోని తెలంగాణ బిడ్దలకు ఇబ్బంది కలిగినట్లు తాను సమాచారం అందించగానే టీఆర్ఎస్ సౌతాఫ్రికా విభాగం అధ్యక్షులు గుర్రాల నాగరాజు స్పందించారని, వారికి సాయం అందించారని గుర్తుచేశారు.
అలాగే ఈ శాఖ ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుండటాన్ని అభినందించారు. ‘‘సౌతాఫ్రికాలో ఉంటున్న తెలంగాణ బిడ్డలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటున్న సౌతాఫ్రికా టీఆర్ఎస్ శాఖకు పార్టీ తరపున, ప్రత్యేకంగా నా తరపున శుభాభినందనలు. సౌత్ ఆఫ్రికా టీఆర్ఎస్ శాఖ మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని, ఎందరికో సహాయకారిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు’’ అంటూ కవిత లేఖ రాశారు.