హైదరాబాద్ : పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాగంటి గోపినాథ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగిలో పీసీసీ అధ్యక్షుడు కల్లు తాగిన కోతిలా వ్యవహరించారని, వ్యవసాయం గురించి కాంగ్రెస్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. రేవంత్‌రెడ్డి ఓ కమెడియన్లో మారాడని, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
ఆయనకు నోటివెంట కుంభకోణాలు తప్ప మరో పదడం రావడం లేదని విమర్శించారు. రేవంత్‌కు విషయ పరిజ్ఞానం లేదని, ఇటీవల ఆయన మాట్లాడిన ఇంగ్లిష్ చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఎంపీగా ఉన్న పీసీసీ చీఫ్ ఇంగ్లిష్ కోసం ట్యూటర్‌ను పెట్టుకుంటే మంచిదని, బట్లర్ ఇంగ్లిష్‌ను భరించలేకపోతున్నారన్నారు. సత్యానాదెళ్ల ఏ సంస్థకు సీఈవోను తెలియదని విమర్శించారు. వాళ్ల నాయకుడు అఖిల భారత పప్పు అయితే.. రేవంత్ తెలంగాణ పప్పుగా తయారయ్యాడన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
వెంటనే ఆయనను ఎర్రగడ్డ మెంటల్ మాస్పిటల్లో చేర్పించాలని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని, ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. ఒడిశాలో సింగరేణికి చెందిన కోల్‌బ్లాక్‌లో 50వేలకోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని, అసలు నైని కోల్‌బ్లాక్‌లో బొగ్గు విలువ అంత లేదన్నారు. సింగరేణి టర్నోవర్ ఎంతో తెలియదని, సంస్థను విమర్శించడం సిగ్గుగా అనిపించడం లేదా? అంటూ మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణపై పార్లమెంట్లో ప్రశ్నించాల్సింది పోయి బీజేపీతో కుమ్మక్కై సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారన్నారు.
ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ పరిగిలో రేవంత్‌రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను ఎవరూ గుర్తించడం లేదని, అందుకే ఉనికిని చాటుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కొల్లగొట్టిన పార్టీల జెండాలు మోసిన రేవంత్.. ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తన కార్యక్రమం పేరు ‘మన పార్టీ – మన పోరు’ మార్చుకుంటే మంచిదన్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అనీ, తెలంగాణ బడ్జెట్‌ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం మెచ్చుకున్నారన్నారు. కే
సీఆర్ తెలంగాణ బంధువు అయితే.. రేవంత్‌రెడ్డి తెలంగాణ పాలిట తాలిబన్లా మారారన్నారు. ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అవినీతి గురించి మాట్లాడడం చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. రేవంత్ అవినీతిపరుడు కాకపోతే జూబ్లీహిల్స్‌లో ఇన్ని ఇండ్లు, స్థలాలు ఎక్కడివని ప్రశ్నించారు. ఆయన బ్లాక్మెయిల్ భాగోతం గురించి ఎవరిని అడిగినా చెబుతారన్నారు. సీఎం కుటుంబం గురించి మాట్లాడితే.. కాంగ్రెస్ నేతల కుటుంబాల గురించి తాము మాట్లాడాల్సి వస్తుందని.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ హుందాగా ఉంటే మంచిదన్నారు.