వృద్ధాప్య పింఛన్ 57 ఏండ్లకే

- అర్హత వయసును తగ్గించిన ప్రభుత్వం
- 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ జీవో
- ఇప్పటికే రాష్ట్రంలో 42 లక్షల మందికి పింఛన్
- తాజా నిర్ణయంతో మరికొన్ని లక్షలమందికి..
- పింఛన్ల కోసం ఏటా రూ.12 వేలకోట్లు ఖర్చు
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. పింఛన్ల అర్హత వయసును తగ్గించాలని ఆదివారం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. గ్రామ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తారు. పింఛన్ వయసు నిర్ధారణకు ఓటరు జాబితా, ఆధార్‌కార్డు, ఇతర ఆధారాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
ఏటా రూ.12 వేల కోట్లు!
రాష్ట్రంలో 37 లక్షల మందికి ఆసరా పింఛన్ నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. మరో ఐదు లక్షలమంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 అందజేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ కేవలం రూ.200 ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో దానిని టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట రూ.1,000, తర్వాత రూ.2,000కు పెంచింది. కరోనా సంక్షోభంలోనూ పింఛన్లకు ఇబ్బంది లేకుండా నిధులు విడుదల చేసింది. ఆసరా పింఛన్లకు 2019లో రూ.7,427.32 కోట్లు, 2020లో రూ.9,828.33 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పుడు అర్హత వయసును తగ్గించడంతో పింఛన్లకు ఏటా రూ.12 వేలకోట్ల వరకు అవసరమవుతాయని అంచనా. 2021-22 బడ్జెట్లో పింఛన్లకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, వితంతువులు, ఎయిడ్స్ రోగులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, చేనేత కార్మికులకు కూడా పింఛన్ అందిస్తున్నారు.
వీరు అర్హులు..
- 50 ఏండ్లు పైబడిన గీత, చేనేత కార్మికులు.
- 18 ఏండ్లు నిండిన వితంతువులు.
- 40 శాతానికిపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు.
- మూడెకరాలలోపు తరి, 7.5 ఎకరాలు మించకుండా మెట్ట భూమి ఉన్నవారు.
లక్షలమందికి ప్రయోజనం: మంత్రి ఎర్రబెల్లి
వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును తగ్గించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

