మామిళ్లగూడెం, డిసెంబర్ 9: రిటైర్మెంట్ తర్వాత మరణించిన భర్త పింఛన్‌తోపాటు రావాల్సిన ఇతర అలవెన్సుల కోసం ఓ మహిళను రూ.40 వేలు డిమాండ్ చేసిన ఖమ్మం ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో అటెండర్‌గా పనిచేసిన మెట్ట మల్లయ్య రిటైర్మెంట్ తరువాత మరణించాడు. తన కు ఫ్యామిలీ పింఛన్ ఇవ్వాలని, అలవెన్సులను మంజూరు చేయాలని కోరుతూ అత డి భార్య ఖమ్మంలోని ట్రెజరీ డిపార్ట్మెంట్లో దరఖాస్తు చేసుకుంది. ఎన్ని రోజులు తిరిగినా పనికాలేదు.
దీంతో ఆమె ఆ డిపార్ట్మెంట్లోని పెన్షన్ విభాగ సీనియర్ అకౌంటెంట్ కట్టా నగేశ్‌ను కలిసి తన బెనిఫిట్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని వేడుకున్నది. అయినా ప నికాకపోవడంతో తనకు తిరిగే ఓపిక లేక త న బంధువును సద రు కార్యాలయాని కి పంపింది. అత డు వెళ్లి సీనియర్ అకౌంటెంట్ నగేశ్‌ను క లువగా సుమారు రూ.4 లక్షల వరకు అలవెన్సులు వస్తాయని, అందుకుగాను రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీం తో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వెంటనే వారు రంగంలోకి దిగారు. బాధితుల ఫోన్ నుంచి నగేశ్‌కు ఫోన్‌కాల్ చేయించి వాయిస్ రికార్డు అయ్యేలా చూ శారు. ఫోన్ మాట్లాడిన క్రమంలోనూ అతడు లంచం డిమాండ్ చేశాడు. వీటి ఆధారంగా సోమవారం నగేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.
తుర్కయంజాల్, డిసెంబర్ 9: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధిలో నివాసం ఉంటున్న రాజేందర్‌రెడ్డికి అరు నెలల క్రితం మల్లారెడ్డి నారాయణ దవాఖానలో స్టంట్ వేశారు. డిశ్చార్జ్ అయిన తరువాత సీఎం సహాయనిధి కోసం రూ.లక్షా10 వేల బిల్లులను సమర్పించారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. రాజేందర్‌రెడ్డి చెక్కుపై గల రూ.5000 చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఖర్చు చేసిన వాటిలో సగం నగదైనా సీఎం సహాయనిధి ద్వారా అందుతుందని ఆశించగా కేవలం రూ.5000 చెక్కును అందించడంపై తీవ్రనిరాశకు లోనయ్యాడు. చెక్కును తిరిగి తీసుకోవాలని అధికారులను కోరినా వారు పట్టించుకోవడం లేదని వాపోయారు.