హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ పాస్ దారులకు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ ఆర్టీసీ కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకొని డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని, ఈ సదుపాయం ఎక్స్ప్రెస్ పాస్ దారులకు మాత్రమేనని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
వంద కిలోమీటర్ల పరిధిలో జారీచేసే ఈపాస్ స్థానిక బస్పాస్ కౌంటర్లలో లభ్యమవుతుందని ఎండీ సూచించారు.