‘ఆర్టీవో’లో అక్రమాల నివారణకు చర్యలు.. ఆఫీస్, డ్రైవింగ్ ట్రాక్ దగ్గర ఏజెంట్లకు నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాలు, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో జరుగుతున్న అక్రమాలపై రవాణాశాఖ విజిలెన్స్ విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలు, అవినీతి నిరోధక శాఖ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన తీవ్రమైన అవకతవకల నేపథ్యంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ఎం చంద్రశేఖర్‌గౌడ్ సోమవారం పలు ఆదేశాలు ఇచ్చారు.
- రూల్స్ పాటించకుంటే కార్యాలయ సిబ్బందిపై వేటు
- ఆదేశాలు జారీ చేసిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాలు, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో జరుగుతున్న అక్రమాలపై రవాణాశాఖ విజిలెన్స్ విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలు, అవినీతి నిరోధక శాఖ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన తీవ్రమైన అవకతవకల నేపథ్యంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ఎం చంద్రశేఖర్‌గౌడ్ సోమవారం పలు ఆదేశాలు ఇచ్చారు.
డ్రైవింగ్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండానే లైసెన్సులు జారీ చేయడం, దరఖాస్తుదారుడు లేకుండానే లైసెన్స్ మంజూరు చేయడం, ప్రైవేట్ ఏజెంట్లతో కుమ్మకవడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణమే అమల్లోకి వచ్చేలా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.
జారీ చేసిన నిబంధనలివే..
- నిర్ణీత పరీక్ష తేదీన దరఖాస్తుదారుడు డ్రైవింగ్ ట్రాక్ వద్ద వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే. అభ్యర్థి రాకుండా ఏ పరిస్థితుల్లోనూ లైసెన్స్ జారీ చేయకూడదు.
- అభ్యర్థులు నిర్ణీత టెస్ట్ మార్గాన్ని పూర్తి చేయాలి. కేవలం స్టీరింగ్ పట్టుకొని కూర్చోవడం లేదా కొద్దిదూరం నడు పడం ద్వారా పాస్ చేయడం నిషిద్ధం. పరీక్ష జరిగే సమయమంతా సీసీ టీవీ కెమెరాలు పనిచేయాలి. నిఘా పరికరాలను నిలిపివేస్తే కఠిన చర్యలు తప్పవు.
- ఆర్టీవో కార్యాలయాలు, డ్రైవింగ్ ట్రాక్‌ల ప్రాంగణంలోకి బ్రోకర్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ సూల్ ప్రతినిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ప్రైవేట్ ఏజెంట్లతో చేతులు కలిపినట్టు తేలితే సదరు ప్రభుత్వ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేస్తారు.
- పాస్/ఫెయిల్ వివరాలు, లైసెన్స్ జారీ లాగ్లను పకాగా నిర్వహించాలి. ప్రతి నెలా 15వ తేదీ లోపు నెలవారీ కంప్లయెన్స్ నివేదికను రవాణా కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

