ఒకే రాష్ట్రం.. ఒకే పన్ను విధానం!.. ఇలంబర్తి
తెలంగాణలో ‘ఒకే రాష్ట్రం, ఒకే పన్ను విధానం’ వైపు మొగ్గుచూపడం అత్యవసరమని నిర్ణయించామని, టూరిస్టు బస్సుల త్రైమాసిక పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ‘ఒకే రాష్ట్రం, ఒకే పన్ను విధానం’ వైపు మొగ్గుచూపడం అత్యవసరమని నిర్ణయించామని, టూరిస్టు బస్సుల త్రైమాసిక పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు. త్రైమాసిక పన్ను హేతుబద్ధీకరణపై శుక్రవారం ఆయన రవాణా శాఖ కార్యాలయంలో టూరిస్టు బస్సు ఆపరేటర్లతో సమావేశమై అభిప్రాయాలను సేకరించారు.
ప్రస్తుతం టూరిస్టు బస్సు ఆపరేటర్లకు సింగిల్ డిస్ట్రిక్ట్ ట్యాక్స్, టూ డిస్ట్రిక్ట్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అనే మూడు వేర్వేరు స్లాబుల్లో విధిస్తున్న పన్నులను సరళీకరించేందుకు కసరత్తు చేస్తున్నామని, ఆపరేటర్లపై పన్ను భారం పెంచకుండానే ఈ మూడు స్లాబులను తొలగించి ‘ఒక రాష్ట్రం, ఒకే పన్ను’ విధానం వైపు వెళ్లడం అవసరమని భావించామని తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు గతంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో అదనపు రవాణా కమిషనర్ రమేష్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

