రాష్ట్రంలో నెలకు 2% విద్యుత్తు నష్టం
తెలంగాణ విద్యుత్తు ప్రసార వ్యవస్థలో నష్టాలు (ట్రాన్స్మిషన్ లాసెస్) ఆందోళన కలిగిస్తున్నాయి. నెలకు సగటున 2% చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 140-200 మిలియన్ యూనిట్ల విద్యుత్తు నష్టం సంభవించింది. ఈ ఏడాది మార్చిలో ఈ నష్టం ఏకంగా 201 మిలియన్ యూనిట్లకు చేరింది.
- ట్రాన్స్మిషన్ లాసెస్‌లో హెచ్చుతగ్గులు
- మార్చిలో 201 మిలియన్ యూనిట్ల నష్టం
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు ప్రసార వ్యవస్థలో నష్టాలు (ట్రాన్స్మిషన్ లాసెస్) ఆందోళన కలిగిస్తున్నాయి. నెలకు సగటున 2% చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 140-200 మిలియన్ యూనిట్ల విద్యుత్తు నష్టం సంభవించింది. ఈ ఏడాది మార్చిలో ఈ నష్టం ఏకంగా 201 మిలియన్ యూనిట్లకు చేరింది. 2025 నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు నమోదైన ట్రాన్స్మిషన్ నష్టాలు స్థిరంగా లేవు. కొన్ని నెలల్లో నష్టం తగ్గినప్పటికీ మరికొన్ని నెలల్లో మళ్లీ పెరిగింది. నిరుడు నవంబర్‌లో ట్రాన్స్మిషన్ నష్టాలు 2.08 శాతంగా నమోదయ్యాయి. డిసెంబర్లో 2.11, ఈ ఏడాది జనవరిలో 2.12, ఫిబ్రవరిలో 2.26 శాతానికి పెరిగాయి. మార్చిలో ఈ నష్టం స్వల్పంగా తగ్గి 2.14 శాతంగా నమోదైంది.
ట్రాన్స్మిషన్ లాస్ అంటే..
ఉత్పత్తి చేసిన లేదా కొనుగోలు చేసిన విద్యుత్తుకు బిల్లింగ్ చేసిన విద్యుత్తుకు మధ్య ఉండే వ్యత్యాసాన్నే ట్రాన్స్మిషన్ లాస్‌గా పరిగణిస్తారు. తీగల్లో విద్యుత్తు ప్రవహించినప్పుడు వేడి, ఇతర శక్తి రూపాల్లో వృథా అయ్యే విద్యుత్తును ప్రసార నష్టంగా పేర్కొంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.30 శాతంగా ఉన్న నష్టం.. మే నెలలో 2.20 శాతానికి, జూన్‌లో 2.08 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ ఈ నష్టాలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన దాఖలాలు లేవు.
రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నందున ప్రసార వ్యవస్థ సామర్థ్యం, గ్రిడ్ నిర్వహణ, సబ్స్టేషన్ల పనితీరు, లైన్ల సామర్థ్యం లాంటి అంశాలపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని, సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

